|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 02:21 PM
బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్ మళ్లీ భారీ షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి దిగొచ్చిన పసిడి.. ఇప్పుడు మళ్లీ కొత్త రికార్డుల వైపు పరుగులు తీస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పుత్తడి, వెండి ధరలు ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం మన దేశీయ మార్కెట్, ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. పసిడి ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయి.
22 క్యారెట్ల బంగారం: హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల (ఆభరణాల తయారీకి వాడే) పసిడి ధర ఒక్కరోజులోనే రూ. 3,150 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల (తులం) ధర ఏకంగా రూ. 1,40,210 కు చేరుకుంది. గత పది రోజుల్లోనే పసిడి ధర దాదాపు రూ. 9 వేల వరకు పెరగడం గమనార్హం.24 క్యారెట్ల బంగారం: స్వచ్ఛమైన 24 క్యారెట్ల పుత్తడి ధర హైదరాబాద్‌లో ఏకంగా రూ. 3,440 మేర ఎగబాకింది. ప్రస్తుతం 10 గ్రాముల రేటు రూ. 1,52,960 వద్ద కొనసాగుతోంది.18 క్యారెట్ల బంగారం: ఇక 18 క్యారెట్ల బంగారం రేటు కూడా పెరిగి 10 గ్రాములకు రూ. 1,14,710 వద్ద స్థిరపడింది