అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 11:05 AM
రాష్ట్రంలో మద్యం, బీర్ల ధరలు మే నెల నుంచి గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, సహజవాయువు సరఫరా దెబ్బతినడం వల్ల గాజు సీసాల తయారీ ఖర్చు పెరిగి, ఉత్పత్తి 40% తగ్గింది. దీంతో ఖాళీ సీసాల ధరలు 20% పెరిగాయి. తయారీదారులు ధరలను 12-15% పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వం ధరల సమీక్షకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని నియమించింది. వేసవిలో బీర్లకు డిమాండ్ 30% పెరిగినా, సరఫరా 20% తగ్గడంతో కొరత ఏర్పడింది. అల్యూమినియం క్యాన్ల ధరలు పెరగడంతో బీర్ల ధరల పెంపు అనివార్యమని కంపెనీలు చెబుతున్నాయి.