|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 02:09 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ నెల 12న మంచిర్యాల జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉదయం 11 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయంలో పాల్గొననున్నారు.ఈ పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గారు కేటీఆర్ గారిని కలసి ఆహ్వానించారు.జిల్లా పర్యటనలో భాగంగా.. ఎన్నో ఒడిదొడుకులు, బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి కట్టుబడిఉన్న క్యాతన్ పల్లి మున్సిపల్ చైర్మన్, సభ్యులను కేటీఆర్ గారు సన్మానించనున్నారు.మధ్యాహ్నం 12:30 భాగంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి కుమార్తె వివాహ వేడుకకు కూడా కేటీఆర్ గారు హాజరుకానున్నారు.వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు క్యాతన్ పల్లి లోని బాల్క సుమన్ గారి నివాసంలో కేటీఆర్ గారు మీడియాతో ఇంటరాక్ట్ కానున్నారు.. అదే సమయంలో పలు సంఘాల నాయకులను కేటీఆర్ గారు కలవనున్నారు.