|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 12:37 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా 7వ రోజు బుధవారం పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం, శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు.