|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 02:20 PM
రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, దేశాన్ని విభజించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. రేవంత్ ఒక జాతీయ పార్టీలో ఉన్నారని గుర్తుంచుకోవాలని, తనకు తాను హీరో అనుకుంటే ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. టైం వచ్చినప్పుడు ప్రజలు హీరోలను జీరోలు చేయగలరని దుయ్యబట్టారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలో రేవంత్ ఉన్నారని, 2029లో జమిలి ఎన్నికలు జరుగుతాయని, బీజేపీ వస్తేనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.