|
|
by Suryaa Desk | Wed, Mar 25, 2026, 03:05 PM
TG: రాష్ట్రంలో అర్హులైన పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మార్చి 31 నాటికి లక్షా 12 వేల ఇళ్లు పూర్తవుతున్నాయని, వివిధ నిర్మాణ దశల్లో ఉన్న మరో లక్ష ఇళ్లు జూన్ నాటికి పూర్తి కానున్నాయని తెలిపారు. ఏప్రిల్ చివరి వారం లేదా మే నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేపడతామని, గతంలో సగం నిర్మించి వదిలేసిన గృహలక్ష్మి ఇళ్లకు కూడా నిధులు ఇస్తామని, ఇల్లు కట్టినదాన్ని బట్టి ఆర్థిక సహాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి వెల్లడించారు.