|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 03:16 PM
న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ లా సెట్ (TG LAWCET), పీజీఎల్‌సెట్ (TG PGLCET) దరఖాస్తుల గడువును ఉన్నత విద్యా మండలి (TGCHE) పొండిగించింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ గడువు ఏప్రిల్ 1తో ముగిసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా మూడేండ్లు, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ (LLB) కోర్సులతో పాటు, రెండేండ్ల ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ మేరకు అవకాశం కల్పించినట్లు టీజీసీహెచ్ఈ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 18న రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు.మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఐదేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా బీఎల్ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రవేశపరీక్ష ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ మీడియంలలో నిర్వహిస్తారు. పీజీఎల్‌సెట్ ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది.