|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 10:27 AM
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ టెలీకామ్ నగర్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ మరబోయిన రవి యాదవ్ గారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు యువతతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని, రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలియజేశారు.“ గంగ జామున తాహేజిబ్ పవిత్ర రంజాన్ మాసం శాంతి, సహనం, దాతృత్వానికి ప్రతీక. ఈ పవిత్ర సమయంలో మనందరం కలసికట్టుగా ఉండి సోదరభావాన్ని పెంపొందించుకోవాలి అని తెలిపారు. రంజాన్ మాసం మనందరిని ఒకటిగా కలిపే పవిత్ర సమయం. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ కొమిరిశెట్టి సాయిబాబా గారు, విజయ్ రెడ్డి గారు, అల్లావుద్దీన్ పటేల్, సయ్యద్ రహ్మత్ సయ్యద్ నసీర్, సయ్యద్ షబ్బీర్,సయ్యద్ వజీర్, మొహమ్మద్ తాహెర్, మొహమ్మద్ బురాన్, షైక్ మునావర్ పాషా, ఖాదర్ ఖాన్ , మహేష్,మాజిత్, శ్రీకాంత్ యాదవ్, శ్రీశైలం , సాయి నందన్, తదితరులు పాల్గొనడం జరిగింది