|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 10:32 AM
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్‌చెరు పట్టణంలోని చైతన్య నగర్ కాలనీలో గల శ్రీ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ మాద్రి దేవేందర్ రాజు గారు, బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరిగా జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలు, లాభనష్టాలు, విజయాపజయాలను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ జైపాల్ ముదిరాజ్ గారు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, మాజీ కార్పొరేటర్లు సప్పన్న దేవ్ గారు, శంకర్ యాదవ్ గారు, మెట్టు కుమార్ గారు, గూడెం మధు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ గారు తదితరులు, పట్టణ ప్రముఖులు, కుల సంఘాల నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు