|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 12:40 PM
ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలకు కోడిగుడ్ల ఎగుమతులను నిలిపివేశాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పౌల్ట్రీ ఫారాలు నిల్వలతో నిండడంతో హోల్‌సేల్ గుడ్ల ధరలు సగానికి పడిపోయాయి. గతంలో వారానికి పది వేల ట్రేలు విక్రయిస్తే ఇప్పుడు సగం కూడా విక్రయాలు జరగడం లేదని ఫారమ్ నిర్వాహకులు చెప్తున్నారు. పైగా ఇంతకుముందు హోల్‌సేల్‌గా రూ.6.50లకు విక్రయించిన గుడ్డు ధర ఇప్పుడు రూ.3.40కు పడిపోయింది. దీంతో వ్యాపారులు నష్టపోతుండగా, సాధారణ కస్టమర్లకు ధర తగ్గడం కొంత ఊరట కలిగిస్తోంది.