|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 02:25 PM
కూకట్పల్లి గ్రామంలోని శ్రీ సీత రామచంద్రస్వామి దేవాలయం లో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు పండితుల వేద ఆశీర్వాదం తీసుకున్నారు. ఈనెల 27 శ్రీరామ నవమి సందర్భంగా కూకట్పల్లి రామాలయoతో పాటు మిగిలిన ఆలయాల్లోనూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ బండి రమేష్ గారు అధికారులకు సూచించారు. శ్రీ రామ రోజు జరగనున్న రాములవారి కళ్యాణం సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై రమేష్ శనివారం కూకట్పల్లి రామాలయంలో వాటర్ వర్క్స్ విద్యుత్ పోలీస్ జిహెచ్ఎంసి అధికారులతోపాటు రామాలయం కార్యనిర్వాహక కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ శ్రీ రాముల వారి కళ్యాణం సందర్భంగా ఆలయాల్లో భక్తులు రద్దీని వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరుతోపాటు అన్ని ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని సూచించారు ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాలని పోలీసు వారికి అటు అగ్నిమాపక శాఖ అధికారులతోనూ రమేష్ మాట్లాడారు. భోజనాల సమయంలో రద్దీ, తొక్కిసలాట లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ గుడెపు నాగరాజు, లక్ష్మయ్య, కూకట్పల్లి డివిజన్ అధ్యక్షుడు మేకల రమేష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి, M. శ్రీనివాసరావు, G.నాగేశ్వర రావు, మేకల సుదర్శన్,మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు....