|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 11:57 AM
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నడుస్తున్న హుక్కా సెంటర్‌పై పోలీసులు ఆదివారం రాత్రి మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో భారీగా హుక్కా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మత్తులో ఉన్న పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా హుక్కా సెంటర్లు నడిపినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.