|
|
by Suryaa Desk | Tue, Mar 24, 2026, 11:01 AM
TG: హైదరాబాద్ సహా రాష్ట్రంలో సోమవారం వందలాది పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. పెద్ద మొత్తంలో నగదు చెల్లించలేని డీలర్లు కొనుగోళ్లు తగ్గించుకోవడంతో ఇంధన కొరత ఏర్పడింది. ఇంతకాలం డీలర్లకు క్రెడిట్‌పై ఇంధనం సరఫరా చేసిన ఆయిల్ కంపెనీలు ఇప్పుడు ‘నో క్రెడిట్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా కంపెనీలు క్రెడిట్ ఇవ్వడం నిలిపివేయడంతో కొన్ని బంకులు మూసివేసినట్టు నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.