|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 04:00 PM
దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 60 రోజులకు సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, కొరత పేరిట జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. అన్ని పెట్రోల్ పంపులు యథావిధిగా పనిచేస్తున్నాయని తెలిపింది. రాబోయే 60 రోజులకు అవసరమైన ముడి చమురు సరఫరాకు భారతీయ చమురు కంపెనీలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, ఎల్పీజీ నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.