|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 12:43 PM
నల్లగొండ మండలం జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. రైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి గ్రామాల్లోనే కొనుగోలు సౌకర్యం కల్పించాలన్నదే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం.రైతులు ఆష్టకష్టాలు పడి పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించడంతో పాటు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిగేలా మేము చర్యలు తీసుకుంటున్నాము. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూకం నుంచి నగదు జమ వరకు ప్రతి ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశాము.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం మరియు రైతుల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. అన్నదాతల ముఖాల్లో చిరునవ్వు చూడటమే మా అసలైన విజయం. రైతు సోదరులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.