|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 11:51 AM
TG: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న 'తెలుగు మీడియం కిచెన్' రెస్టారెంట్‌లో కుళ్లిన చికెన్ వడ్డించిన ఘటన కలకలం రేపింది. ఆదివారం ఓ పోలీసు అధికారి ఈ రెస్టారెంట్‌లో చికెన్ ఆర్డర్ చేయగా, దుర్వాసన రావడంతో సిబ్బందిని ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యపు సమాధానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించి, దుర్వాసన వస్తున్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని పరీక్షలకు పంపారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.