బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 03:36 PM
తెలంగాణలో ప్రస్తుత రాజకీయాలు కాకరేపుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఆ పార్టీపై తెలంగాణ రక్షణ సేన (TRS)పార్టీ అధినాయకురాలు కవిత సంచలన విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల బీఆర్ఎస్ పేరును తిరిగి TRSగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్లు KTR ప్రకటించారు. అయితే ఈ లోపే కవిత TRS పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచి TRS పార్టీకి ప్రజలకు మధ్య ఉన్న సెంటిమెంటును వాడుకోవాలని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే BRSకు అధికారం దూరమై సీఎం కావాలనే KTR కలకు కవిత చెక్ పెట్టనుందని చర్చ జరుగుతోంది.