బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 15, 2026, 11:25 AM
కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని, సీరియల్ నెంబర్ ప్రకారం కొనుగోలు చేసి మిల్లులకు పంపాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, ధాన్యం రాశులను, రికార్డులను, ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను పరిశీలించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూడాలని సూచించారు.