|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 11:22 AM
పటాన్ చెరు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన పటాన్ చెరు మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి సన్మాన సభకు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి తో కలిసి నీలం మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు నూతన వ్యవసాయ కమిటీ చైర్మన్ శివానందం, వైస్ చైర్మెన్ రాజశేఖర్ మరియు కమిటీ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా నీలం మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందని మరోసారి రుజువైందన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని మోసం చేసి తిరిగి వెళ్ళాడని విమర్శించారు. నియోజకవర్గ సిఎస్ఆర్ నిధులపై ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే గత పన్నెండు సంవత్సరాలలో జరిగిన నిధుల గోల్ మాల్ పై సమాధానం చెప్పాలన్నారు. పన్నెండేండ్లుగా జరిగిన సిఎస్సార్ నిధుల అవకతవకలపై విచారణ జరపాలని మంత్రి వివేక్ కు విజ్ఞప్తి చేశారు. పటాన్ చెరు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికై సహకరించాలని కోరారు, ఈ సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు జాతీయ రహదారి నుండి లక్డారం- బ్యాతోల్, బ్యాతోల్ -రుద్రారం, తదితర రహదారుల దుస్థితి పై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి అన్ని రహదారులకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు, ఈ కార్యక్రమంలో టీ జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాట సుధా, మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, ప్రజలు,తదితరులు పాల్గొన్నారు..