బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 25, 2026, 10:53 AM
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌లోని పురాణాపుల్ ఆర్యవైశ్య సంఘంలో మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత పఠనం విజయవంతంగా 51వ వారం పూర్తి చేసుకుంది. కచ్చితమైన డ్రెస్ కోడ్‌తో క్రమశిక్షణతో సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండుసార్లు పారాయణం పూర్తి చేసి, ప్రస్తుతం మూడోసారి (3వ అధ్యాయం) పఠిస్తున్నారు. శ్లోకాలతో పాటు తాత్పర్యాలను సులభంగా వివరిస్తూ జ్ఞానాన్ని పంచుతున్నారు. పఠనం అనంతరం సంప్రదాయ 'కొలతలు' ఆడుతూ ఉత్సాహంగా గడిపారు. భగవద్గీత నిత్య జీవితానికి మార్గదర్శి అని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక విలువలను పెంపొందిస్తాయని మహిళా సభ్యులు తెలిపారు.