|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 10:18 AM
తెలంగాణలో ఎండల ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు IMD రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, తూర్పు జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44°C నుంచి 45°C వరకు పెరిగే అవకాశం ఉంని హెచ్చరించింది. హైదరాబాద్‌లో కూడా 40°C పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ప్రజలు మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించింది.