|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 03:42 PM
అమీన్పూర్ :అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ సర్పంచులు మల్లేష్, భాస్కర్ గౌడ్, కృష్ణ, సీనియర్ నాయకులు సత్యనారాయణ, రుశ్వంత్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.