|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 03:08 PM
ఆదిలాబాద్ పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పలు రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలన్నీ నేడు హిందూ సంస్కృతి, సంప్రదాయాల వైపు ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. యుద్ధ వాతావరణంలోనూ భారత్ సురక్షితంగా ఉండటానికి మన సంప్రదాయాలే కారణమని, భావితరాలకు మన గొప్పతనాన్ని వివరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఆయన వెంట కౌన్సిలర్లు లాలా మున్న, జ్యోతి, మనోజ్ తదితరులున్నారు.