|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 11:30 AM
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం 1 లక్షా 8 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. బడ్జెట్లో 8.3 శాతం నిధులు విద్యపైన ఖర్చు పెడుతున్నాం. ప్రైవేటు విద్యా సంస్థల తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విధానం లేదు. రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం విఫలం చెందడం వల్లే ప్రైవేటు వైపు వెళుతున్నారు.అందుకే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మకంగా వంద ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి విధానం తీసుకొస్తున్నాం. 1.34 కోట్ల జనాభా కలిగిన హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియా CURE లో పాఠశాలలను రేషనలైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా మోడల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలు సక్సెస్ కావడానికి నర్సరీ, ఎల్‌కేజీ వంటి విధానంతో పాటు రవాణా సౌకర్యం కూడా ఒక కారణం. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికి తోడు బ్రేక్ ఫాస్ట్, లంచ్, అది కూడా మంచి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయించాం.