|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 02:33 PM
నేడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడలో అడివయ్య వస్తాద్ గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో *జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు అడివయ్య వస్తాద్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు . అదేవిధంగా స్థానిక వ్యాయామశాలలో ఏర్పాటు చేసిన కుస్తీ సామాగ్రికి ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇండియన్ స్టైల్ రెజ్లింగ్‌లో అపారమైన కీర్తి, ప్రతిష్టలు సంపాదించిన మహనీయుడు అడివయ్య వస్తాద్ గారన్నారు.చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని పైల్వాన్లకు మార్గదర్శకుడిగా నిలిచి, వందలాది మంది యువ పైల్వాన్లను తీర్చిదిద్దిన గొప్ప గురువుగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.._కుస్తీ క్రీడను ప్రోత్సహిస్తూ యువతలో క్రమశిక్షణ, ధైర్యం, శారీరక దృఢత్వం పెంపొందించడంలో ఆయన చేసిన సేవలు అపారమని కొనియాడారు.భవిష్యత్ తరాలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ పైల్వాన్లు వి. చిన్న శ్రీశైలం యాదవ్ గారు, గోంటి శ్రీనివాస్ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గోంటి సాయినాథ్, గోంటి విక్రమ్, అలాగే స్థానికులు మరియు పెద్ద సంఖ్యలో పైల్వాన్లు పాల్గొన్నారు.._