అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 12:52 PM
ఐపీఎస్ అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీ శ్రేణులతో "సింగం" అని పిలిపించుకుని, తమిళనాడులో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే మగాడు అంటూ గత కొన్నేళ్లుగా ఊదరగొట్టిన తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకి ఘోర అవమానం ఎదురైంది.ఇవ్వాళ బీజేపీ తమిళనాడు అభ్యర్ధుల లిస్ట్‌లో అన్నామలై పేరు లేదు. గతంలో ద్రవిడ నాయకుల మీద నోరు పారేసుకున్న అన్నామలైని పక్కన పెడితేనే పొత్తు పెట్టుకుంటాం అని అన్నాడీఎంకే పార్టీ కండీషన్ పెట్టడంతో మొదట రాష్ట్ర అధ్యక్షుడి పదవిని పీకేసిన బీజేపీ, ఇప్పుడు తాజాగా టికెట్ కూడా ఇవ్వను పొమ్మంది.తమిళనాడులో బలంగా ఉన్న అస్తిత్వ రాజకీయాలకు ఇదొక మచ్చుతునక.