|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:23 PM
నాచారం డివిజన్లోని హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు మరియు పటేల్ కుంట చెరువులలో విపరీతమైన గుర్రపు డెక్క పెరిగి ఉన్నది. గుర్రపుటక్క తొలగింపు పనులు చేపట్టడానికి కోటి 20 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరై సుమారు రెండు నెలలు గడుస్తున్నా కానీ గుర్రపు డెక్క తొలగింపు పనులు ఇప్పటికీ చేపట్టలేదని జోనల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసిన బారాస రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్. అధికారుల అలసత్వం వల్లనే పనులు చేపట్టడం లేదని తక్షణమే గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభించాలని జోనల్ కమిషనర్ను కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన జోనల్ కమిషనర్ వెంటనే అధికారులకు ఫోన్ చేసి తక్షణమే పటేల్ కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.