బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 02:06 PM
ఎల్లారెడ్డి హెల్త్ వెల్ నెస్ కేంద్రంలో సోమవారం గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ తెలిపిన వివరాల ప్రకారం, 32 మంది గర్భిణీలకు బీపీ, హెచ్‌పీ, ఆర్బీఎస్ పరీక్షలు చేశారు. వారికి క్యాల్షియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు అందించారు. ప్రతి నెలా 3వ, 5వ నెలల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ సూచించారు. రక్తహీనతతో బాధపడేవారు ఐరన్ మాత్రలు డబుల్ డోస్ తీసుకోవాలని, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, క్యారెట్, బీట్‌రూట్, పల్లీ పట్టీలు తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటలు విశ్రాంతి తీసుకోవాలని వివరించారు.