అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 02:10 PM
మహేశ్వరం ఎక్సైజ్ అధికారులు, రిసార్ట్స్, ఫాంహౌస్లు, ఫంక్షన్ హాళ్లలో అనుమతి లేకుండా మద్యం, డ్రగ్స్ వినియోగంతో పార్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ వేదికలపై మద్యం, మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, ఈవెంట్లు నిర్వహించేవారు సంబంధిత శాఖల నుంచి తాత్కాలిక అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమతి లేని కార్యక్రమాలపై, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆస్తుల యజమానులు, నిర్వాహకులు చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వారిదేనని, నిబంధనలు అతిక్రమిస్తే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.