|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 01:58 PM
నారాయణపేట జిల్లా, మరికల్ మండలం అప్పంపల్లి గ్రామంలోని ఆంజనేయుల స్వామి గుడిలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వై. కృష్ణ రెడ్డి, మంగమ్మ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహోత్సవంలో సర్పంచ్ కళ్యాణి అనిల్ కుమార్ రెడ్డి, వై. వెంకట్రాం రెడ్డి, ఎస్. వెంకట్ రెడ్డి, వై. తిరుపతి రెడ్డి, అనంత్ రెడ్డి, కురమూర్తి, రఘుపతి రెడ్డి, దామోదర్ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. 'జై శ్రీరామ్, జై ఆంజనేయ స్వామి' నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.