|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 11:07 AM
గుమ్మడిదల మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం విచ్చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారిని, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారిని స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యారెడ్డి దంపతులు తమ నివాసంలో ‘తేనేటి విందు’ ఏర్పాటు చేసి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యేలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, స్థానిక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.