అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 01:58 PM
హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని కమలానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఉస్మానియా బిస్కెట్ల తయారీ కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు, ఆకర్షణీయమైన రంగుల కోసం కెమికల్స్, నాసిరకం, పాడైన గుడ్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో తయారీ సాగుతుండటంతో యజమాని మేరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.