|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 02:03 PM
భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా తొలి విడతలో రూ.351కోట్లతో చేపట్టబోయే పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.రాములోరి కల్యాణంలో భాగంగా... ముహూర్త లగ్నం సమయంలో సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచారు. శ్రీరామదాసు చేయించిన మూడు తాళిబొట్లు ఉన్న మంగళసూత్రానికి పూజలు నిర్వహించి... మూడు బొట్లు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కల్యాణ వేడుక ముగిసింది. భద్రాచలం ఆలయ పండితులు శాస్త్రోక్తంగా సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఇక, రాములోరి కల్యాణం వీక్షించేందుకు భారీగా భక్తులు సైతం తరలివచ్చారు.మిథిలా స్టేడియంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకను వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించి ఆనందపడ్డారు.