|
|
by Suryaa Desk | Thu, Mar 26, 2026, 12:41 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మరియు బొమ్మలరామారం మండలాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పర్యటించారు.ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో పర్యటించి, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని నివాసానికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.అదేవిధంగా,సైదాపూర్ చెరువు నిండిపోవడంతో అలుగు పారుతున్న నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదుపరి బొమ్మలరామారం మండల కేంద్రంలో గట్టు మైసమ్మ తల్లి ఆలయం వద్ద సీసీ రోడ్డు పనులను కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేశారు.అనంతరం అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుని ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.