|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 11:03 AM
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్‌చెరు మరియు జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని రామమందిర్, శాంతినగర్, సింఫనీ, ప్రణీత్ నైట్వుడ్స్, నందన్ రతన్ ప్రైడ్, అలీన్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, బండ్లగూడ, శ్రీరామ్‌నగర్ కాలనీ, కృషి డిఫెన్స్, APR, మంజీర ప్రాంతాలలో ఘనంగా నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాలలో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు వివిధ ప్రాంతాలలో నిర్వహించిన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, శ్రీరామనవమి పర్వదినం భారతీయ సంస్కృతి మరియు సనాతన సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన రోజు అని తెలిపారు. శ్రీరాముడు ఆచరించిన సత్యం, ధర్మం, న్యాయం ప్రతి ఒక్కరి జీవితానికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు.
సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరియు పరస్పర గౌరవం పెంపొందేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ పవిత్ర పర్వదినం ప్రతి ఇంటికి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.