|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 02:27 PM
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఆలేరు పట్టణంలో నిర్వహించిన రంజాన్ పర్వదిన వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు నిర్వహించి,వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ,సమాజంలో సౌభ్రాతృత్వం,ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ,అన్ని మతాల ప్రజలు కలిసి శాంతి,సామరస్యంతో జీవించాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,మతపెద్దలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.