|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 02:19 PM
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికలు చేసింది. రాబోయే రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని తెలిపింది. భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి, భద్రాద్రి, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 41-61kms వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అటు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో భారీ వర్షం కురిసింది.