|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 11:55 AM
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 270, 271 డివిజన్ లైన అమీన్‌పూర్ మరియు బీరంగూడ డివిజన్‌లలో ఉన్న వివిధ మస్జిద్లు, ఈద్గాలలో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ . ఈ పవిత్రమైన రంజాన్ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో ఆప్యాయంగా కలిసిమెలిసి ప్రార్థనలు నిర్వహించి, దేశంలో శాంతి, సామరస్యాలు నెలకొనాలని కోరుకున్నారు. ఉపవాస దీక్ష ద్వారా మనసును శుద్ధి చేసుకోవడం, పరస్పర సహకారం, దానధర్మాలు వంటి మహోన్నత విలువలను రంజాన్ మాసం మనకు నేర్పుతుందని పేర్కొన్నారు.అలాగే సమాజంలో అన్ని వర్గాల మధ్య సోదరభావం మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు. పేద ప్రజలకు సహాయం చేయడం, అవసరమైన వారికి అండగా నిలవడం మన బాధ్యత అని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.