|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 02:19 PM
ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో గురువారం నాడు శ్రీ తుల్జా భవానీ నూతన హెయిర్ సెలూన్ షాపును వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత కేవలం ఉద్యోగాల కోసమే వేచి చూడకుండా, స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవడం అభినందనీయమని, షాపు నిర్వాహకులు కష్టపడి పని చేసి, భవిష్యత్తులో మరిన్ని శాఖలను విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు. షాపు నిర్వాహకులు ఆదిత్యరెడ్డి గారిని శాలువాతో ఘనంగా సత్కరించి, తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.