|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 02:26 PM
బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని, తమ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అభ్యర్థులను తామే ఎంపిక చేసుకుంటామని స్పష్టం చేశారు. రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా సర్వేలు చేసి అభ్యర్థులను తామే నిర్ణయిస్తామని తెలిపారు. డివిజన్ అధ్యక్షుల ఎంపికలో తనకు సమాచారం అందలేదని, సొంత పార్టీ నేతలే తనపై నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.