|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:58 PM
తెలంగాణ ప్రభుత్వ విప్ గా ఇటీవల నియమితులైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి తన నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, విజయరమణారావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం కూడా పాల్గొన్నారు.