|
|
by Suryaa Desk | Mon, Mar 23, 2026, 12:52 PM
మరికల్ గ్రామానికి చెందిన నోబెల్ హైస్కూల్ విద్యార్థులు ఎస్. సుమలత (90 మార్కులు) మరియు జి. నికేతన్ (88.75 మార్కులు) నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందారు. ఈ విజయంపై వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కరస్పాండెంట్ అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ నవనీత విద్యార్థులను సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాధక్ సార్, రఘు సార్, శ్రీజిత్ సార్, మరియు పిటి అనిల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.