|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 12:49 PM
ఉగాది పండుగ సందర్భంగా పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ఈరోజు మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ గారు హరీష్ రావు గారిని శాలువాతో సన్మానించి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా, ప్రజల కొరకు అనుక్షణం పరితపించే నిజమైన నాయకులు హరీష్ రావు గారని, వారి స్ఫూర్తితోనే అయిదేళ్లు పటాన్చెరువు కార్పొరేటర్ గా ప్రజల కోసం పనిచేసి,ప్రజల మన్నన పొందడం జరిగిందని తెలియజేశారు. మొన్నటికి మొన్న మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా ఇంద్రేశం మున్సిపాలిటీని వారి చాణక్య నీతితోనే అద్భుతంగా గెలిపించడం జరిగిందని తెలిపారు. వారి సలహాలు, సూచనలు, రాజకీయ దిశా నిర్దేశంతోనే ఇకపైన కూడా ప్రజాక్షేత్రంలో కొనసాగుతానని మెట్టు కుమార్ యాదవ్ గారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పటాన్చెరువు బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజ్ యాదవ్ గారు, బండ్లగూడ టౌన్ ప్రెసిడెంట్ భరత్ కుమార్ గారు, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, రవీంద్ర చారి గారు, కర్నె లక్ష్మయ్య గారు, కార్ రాజు తదితరులు పాల్గొన్నారు.