|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 11:45 AM
నల్గొండ జిల్లా కేంద్రంలోని రెండో భద్రాద్రి రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణాన్ని వివరించారు, దీనిని ప్రజలు ఆసక్తిగా ఆలకించారు. 48వ డివిజన్ కార్పొరేటర్ యామ కవిత దయాకర్ కూడా పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉగాది పచ్చడి సేవించారు.