|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 03:13 PM
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ప్రతాప్ సింగారం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు రంజాన్ “తోఫా” కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక బిలాల్‌లో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు, మాజీ జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్ర రెడ్డి గారు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు.సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం ముస్లిం సోదరులకు అందిస్తున్న ఈ తోఫా కిట్లు వారి ఉపవాస దీక్షలలో ఉపశమనాన్ని కలిగిస్తాయని తెలిపారు. పండుగలు మతసామరస్యానికి ప్రతీకలని, అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారుఈ కార్యక్రమంలో పోచారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఘట్కేసర్ మండల్ అధ్యక్షులు కర్రే రాజేష్ స్థానిక నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు