|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 11:36 AM
TG: అర్హులైన పేదలకే సంక్షేమ ఫలాలు అందేలా రేవంత్ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. రాజకీయ వివక్ష లేకుండా అర్హులకు పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లు మంజూరైనప్పటికీ.. వాటిలో నివసించకుండా ఖాళీగా వదిలేసిన లబ్ధిదారుల నుంచి ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అలాంటి ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.