|
|
by Suryaa Desk | Sat, Mar 21, 2026, 10:40 AM
గచ్చిబౌలి స్టేడియంలో రాక్ సంగీతకారుడు అనిరుధ్ మ్యూజిక్ కాన్సర్ట్ శనివారం నిర్వహించనున్న నేపథ్యంలో, పోలీస్ అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. గచ్చిబౌలి చౌరస్తా నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలను ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద కుడివైపు మళ్ళించి, విప్రో కూడలి మీదుగా గౌలిదొడ్డి, గోపనపల్లి, నల్లగండ్ల వైపు పంపుతారు. అదేవిధంగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపనపల్లి తండా, గౌలిదొడ్డి, క్యూసిటీ విప్రో నుంచి ట్రిపుల్ ఐటీ వైపు వచ్చే వాహనదారులు విప్రో నుంచి నేరుగా నానక్ రాంగూడ ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద మలుపు తీసుకుని గచ్చిబౌలి మార్గాన్ని అనుసరించాలని సూచించారు.