|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 02:53 PM
TG: రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. మొక్కజొన్నలు కోతకు వచ్చినా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ వద్ద హరీశ్ రావు మాట్లాడారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ.2,400 ఉంటే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రూ.1,600, రూ.1,700కే రైతులు పంటను అమ్ముకుమంటున్నారని అన్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.