|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 11:19 AM
పటాన్చెరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి వేన్నవరం ఆదర్శ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం ఈద్గా వద్ద రంజాన్ పవిత్ర మాసంలో భాగంగా ఘనంగా దావత్ ఎ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి గారు,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, పటాన్చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసం మనకు పేదలకు సహాయం చేయాలని, ఒకరిని ఒకరు గౌరవించాలని, ప్రేమతో కలిసిమెలిసి ఉండాలని నేర్పుతుంది. గంగా, జమునా తేహజీబ్ వలె హిందూ, ముస్లిం, సిక్కు, ఇసాయి ఇలా అందరం ఏకమైమన సమాజంలో శాంతి, ఐక్యతను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ దొండ అంజయ్య గారు, జిన్నారం మాజీ ZPTC కోలన్ బాల్ రెడ్డి గారు, జిన్నారం వెంకటేష్ గౌడ్ గారు,బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్, బీఆర్‌ఎస్‌వీ కోఆర్డినేటర్ కృష్ణ కాంత్, భాస్కర్ ముదిరాజ్,మాణిక్ యాదవ్, యువజన అధ్యక్షుడు నర్సింహ, బీఆర్‌ఎస్ యువజన నాయకుడు పృథ్వీరాజ్, మైనారిటీ సీనియర్ నాయకులు గౌస్, అజీముద్దీన్, మునీర్ కుతుబుద్దీన్, అబ్బూ, జావిద్, జాకిర్, అహ్మద్, అమీన్‌పూర్ కో-ఆప్షన్ మెంబర్ యూనస్, జావిద్,షకీల్, తేల్లాపూర్ మాజీ కౌన్సిలర్లు ఉమేష్, బాబ్జి, కంజర్ల శ్రీశైలం, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు పాటి సత్యనారాయణ, దేవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.