|
|
by Suryaa Desk | Wed, Mar 18, 2026, 12:33 PM
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైనదని, వారు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని, ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పేద ముస్లింలకు ప్రభుత్వం తరపున తోఫాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.